పోర్ట్స్మౌత్ : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమ్ ఇండియా సభ్యులకు చతేశ్వర్ పుజారా అనుభవం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఇంగ్లండ్ కౌంటీల్లో పుజారా ఎంతో కాలంగా ఆడుతున్నాడని, ఆ అనుభవం జట్టు సభ్యులకు ఉపయోగపడుతుందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు.
ససెక్స్ జట్టు నాయకత్వ అనుభవం, కౌంటీ సహచరుడు స్టీవ్ స్మిత్‌కు సంబంధించిన సమాచారం టీమ్ ఇండియా సభ్యులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నాడు. ససెక్స్ సమీపంలోని ఓవల్‌కు సంబంధించిన సమాచారం పుజారాకు తెలుసునని, దానిని డబ్ల్యూటీసీ ఫైనల్లో ఉపయోగించుకుంటాడని గవాస్కర్ తెలిపాడు.