United World Wrestling: రెజర్లకు ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య మద్దతు.. అలా చేయకుంటే ఫెడరేషన్‌ను రద్దు చేస్తామని హెచ్చరిక
United World Wrestling: 45 రోజుల్లోగా రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించకుంటే.. అప్పుడు ఆ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేస్తామని యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్చరిక చేసింది. బ్రిజ్‌పై మరోసారి విచారణ చేపట్టాలని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ ఆందోళన చేపట్టిన రెజ్లర్లను అడ్డుకున్న ఘటనపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(United World Wrestling) శాఖ స్పందించింది. రెజ్లర్ల అరెస్టును యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య ఖండించింది. ఈ నేపథ్యంలో ఓ ప్రకటన చేసింది. ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలను తేల్చేందుకు చేపట్టిన దర్యాప్తు కమిటీ రిపోర్టుపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ బాడీ నిరుత్సాహాన్ని వ్యక్తం చేసింది. 45 రోజుల్లోగా రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించకుంటే.. అప్పుడు ఆ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేస్తామని యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్చరిక చేసింది.
రెజ్లర్లను అరెస్టు చేసిన తీరును ఖండిస్తున్నామని, రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్‌పై విచారణ జరిగిన తీరు కూడా సరిగా లేదని, మరోసారి నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య తన ప్రకటనలో కోరింది. రెజ్లింగ్ సమాఖ్య సమావేశాలు నిర్వహించాలని, 45 రోజుల్లోగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని, ఒకవేళ ఎన్నికలు నిర్వహించకుంటే ఫెడరేషన్‌ను రద్దు చేస్తామని, అప్పుడు అథ్లెట్లు తటస్థ జెండాపై పోటీల్లో పాల్గొనాల్సి వస్తుందని, ఇప్పటికే ఈ ఏడాది ఢిల్లీలో జరగాల్సిన ఆసియా చాంపియన్‌షిప్‌ను మరో చోటుకు తరలించే నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

