Iga Swiatek : ఆస్ట్రేలియాలో త్వరలో ప్రారంభం కానున్న అడిలైడ్ ఇంటర్నేషనల్ 2 టోర్నీకి స్టార్ ప్లేయర్ దూరం అయింది. మహిళల టెన్నిస్‌లో వరల్డ్ నంబర్ 1 ఇగ స్వియటెక్ ఈ టోర్నీనుంచి వైదొలిగింది. కుడి భుజానికి గాయం కావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని డబ్ల్యూటీఏ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. కుడి భుజం గాయం కారణంగా వరల్డ్ నంబర్ వన్ స్వియటెక్ అడిలైడ్ ఇంటర్నేషనల్ 2 టోర్నమెంట్ నుంచి తప్పుకుంది అని ట్విట్టర్ పోస్టులో రాసుకొచ్చింది. జనవరి 9న ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే.. ఇదే నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉంది. దాంతో, స్వియటెక్ ఆలోపు కోలుకుంటుందా? లేదా? అనే సందేహం అభిమానుల్లో ఉంది. పురుషుల వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరం కానున్నాడు. కాలికి గాయం కారణంగా అతను ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకోనున్నాడు.
మూడు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన ఆమె సిడ్నీలో శుక్రవారం జరిగిన యునైటెడ్ కప్ మిక్స్డ్ టీమ్స్ టోర్నమెంట్లో అనూహ్యంగా ఓడిపోయింది. అమెరికాకు చెందిన జెస్సీ పెగులా చేతిలో 2-6, 2-6తో పరాజయం చెందంది. అమెరికా జట్టు పోలాండ్‌పై 5-0తో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.