లండన్: వింబుల్డన్‌లో మరో సంచలనం! టైటిల్ ఫేవరేట్లలో ఒకడైన ప్రపంచ మొదటి ర్యాంకర్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ) ఈ టోర్నీ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు. మంగళవారం సెంటర్ కోర్టు వేదికగా జరిగిన క్వార్టర్స్‌లో ఒకటో సీడ్ సిన్నర్ 7-6 (9/7), 4-6, 6-7 (4/7), 6-2, 3-6తో డేనిల్ మెద్వెదెవ్ (రష్యా) చేతిలో ఓడాడు.
సుమారు 4 గంటల పాటు 5 సెట్లలో హోరాహోరీగా పోరాడినా ఇటలీ కుర్రాడికి ఓటమి తప్పలేదు. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో సెర్బియన్ స్టార్ నోవాక్ జొకోవిచ్ 6-3, 6-4, 6-2తో హోల్గర్ రునె (డెన్మార్క్)ను వరుస సెట్లలో ఓడించి ఈ టోర్నీలో 15వ సారి క్వార్టర్స్ చేరాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో వెకిచ్ 5-7, 6-4, 6-1తో సున్ను ఓడించి వింబుల్డన్‌లో తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించింది.