స్టావెంజర్: ప్రపంచ చాంపియన్ డీ గుకేశ్(D Gukesh).. నార్వే చెస్ టోర్నీలో స్టన్నింగ్ విక్టరీ కొట్టాడు. స్టావెంజర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో .. వరల్డ్ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్లసన్‌పై క్లాసికల్ గేమ్‌లో విజయం సాధించాడు. నార్వే చెస్ టోర్నీ ఆరవ రౌండ్లో గుకేశ్ ఆ విక్టరీ నమోదు చేశాడు. అయితే గేమ్ ముగిసిన తర్వాత కార్లసన్.. అసహనంతో బల్లను గట్టిగా గుద్దాడు. దీంతో చెస్ వుడెన్ పీస్‌లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ తర్వాత గుకేశ్ ఇష్టం లేనట్లుగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తేరుకున్న కార్లసన్ మళ్లీ టేబుల్‌పై పావులను అమర్చే ప్రయత్నం చేశాడు.
కార్లసన్ ఓటమిని ఎదురుక్కోవడం చాలా అరుదైన అంశం. 100కు 99 సార్లు ఆ మ్యాచ్‌లో ఓడిపోయే అవకాశం ఉందని, కానీ లక్కీగా ఆ మ్యాచ్‌ను గెలిచినట్లు గుకేశ్ తెలిపాడు. గత ఏడాది డిసెంబర్లో వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ నిర్ణయాత్మక గేమ్‌లో చైనీస్ ప్లేయర్ డింగ్ లీరెన్పై గుకేశ్ ఇదే తరహాలో విక్టరీ కొట్టాడు.
నార్వే గ్రాండ్‌మాస్టర్‌పై క్లాసికల్ గేమ్‌లో గుకేశ్ గెలవడం ఇదే మొదటిసారి. కార్లసన్‌పై విజయం సాధించిన రెండో భారతీయ ప్లేయర్‌గా 19 ఏళ్ల గుకేశ్ నిలిచాడు. గతంలో రమేశ్‌బాబు ప్రజ్ఞానంద చేతిలో ఆయన ఓటమి చవిచూశాడు.
OH MY GOD 😳🤯😲 pic.twitter.com/QSbbrvQFkE
— Norway Chess (@NorwayChess) June 1, 2025