బర్మింగ్‌హామ్: ప్రతిష్ఠాత్మక వరల్డ్ గేమ్స్‌లో భారత ఆర్చరీ జోడీ వెన్నెం జ్యోతిసురేఖ, అభిషేక్ వర్మ కాంస్య పతకంతో మెరిసింది. ఆదివారం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పోరులో సురేఖ, వర్మ ద్వయం 157-156 తేడాతో మెక్సికో జోడీ అండ్రియా, మిగ్యుల్పై అద్భుత విజయం సాధించింది. తొలి రౌండ్లో తమదైన దూకుడుతో ఆధిక్యం కనబరిచిన భారత ద్వయానికి రెండో రౌండ్లో ప్రతిఘటన ఎదురైంది. అయితే నిర్ణయాత్మక మూడో రౌండ్లో కీలక పాయింట్లతో మనోళ్లు విజయం వైపు నిలిచారు. ఓవరాల్‌గా వరల్డ్ గేమ్స్‌లో భారత్‌కు ఇది తొలి పతకమని జాతీయ ఆర్చరీ సమాఖ్య(ఏఏఐ) ఒక ప్రకటనలో పేర్కొంది.