గ్వాంగ్జు (దక్షిణ కొరియా) : ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల రికర్వ్ జట్టు కాంస్య పోరుకు అర్హత సాధించింది. సీనియర్ ఆర్చర్ దీపికా కుమారి, అంకితా, గత ఖడకెతో కూడిన భారత త్రయం.. మంగళవారం వరుస విజయాలతో సెమీస్ చేరినా కీలకపోరులో తడబడింది.
సెమీస్‌లో 2-6తో జపాన్ చేతిలో ఓడి కాంస్య పోరుకు పరిమితమైంది. అంతకుముందు భారత్.. స్లోవేనియా, టర్కీని ఓడించి సెమీస్ చేరింది. పురుషుల రికర్వ్ జట్టు మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది.