మహిళల ప్రపంచకప్‌లో అద్భుతం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లలో ఒక్క విజయం కూడా నమోదు చేయని బంగ్లాదేశ్ మహిళల జట్టు.. ఈ సారి పాకిస్తాన్‌పై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిగర్ సుల్తానా ‘46), షార్మిన్ అక్తర్ (44) రాణించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్రలోనే వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించింది.
50 ఓవర్లకు 237/6 స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో పాక్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. పాక్ ఓపెనర్ సిద్రా అమీన్ (104)తోపాటు కెప్టెన్ బిస్మా మరూఫ్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. వీళ్లిద్దరూ తడబడకుండా ఆడుతున్న సమయంలో విజయానికి మరో 80 పరుగులు అవసరం అయినప్పుడు.. బంగ్లా బౌలర్లు ఫాహిమా ఖాటున్ (3/38), రుమానా అహ్మాద్ (2/29) అద్భుతమైన పట్టుదల కనబరిచారు.
వీరు విజృంభించడంతో పాక్ జట్టు కేవలం ఐదు పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి 225/9 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో బంగ్లా మహిళలు తొలి విజయం నమోదుచేయగా.. ఈ ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిపోయి సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టతరం చేసుకుంది.