హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో పతకాలతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న పారా అథ్లెట్లకు సముచిత గౌరవం దక్కింది. ప్రముఖ ఫ్లాట్ ప్రమోటర్ జీస్వేర్ హౌజింగ్ సంస్థ సోమవారం పారా ఒలింపియన్లకు వింగ్స్ ఆఫ్ ఫైర్ అవార్డులు అందించింది. 2022 సంవత్సరానికి గాను మరియప్పన్ తంగవేలు(హైజంప్), మాన్సి జోషి(బ్యాడ్మింటన్) అవార్డులతో పాటు నగదు బహుమతి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ షట్లర్ సాయిప్రణీత్, సీఆర్పీఎఫ్ డీఐజీ అనిల్మింజ్, ఈశ్వర్ పాల్గొన్నారు.