Brij Bhushan Singh | బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయకపోవడానికి కారణాలివే.. ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు
Brij Bhushan Singh | మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (Wrestling Federation of India Chief), బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Singh)ను అరెస్టు చేయకపోవడానికి గల కారణాలను ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Brij Bhushan Singh | మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (Wrestling Federation of India Chief), బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Singh)ను అరెస్టు చేయకపోవడానికి గల కారణాలను ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు గతంలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసు విచారణలో బ్రిజ్ భూషణ్ తో పాటు, సస్పెండ్ అయిన డబ్ల్యూఎఫ్ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ (Vinod Tomar) తమకు పూర్తి సహకారం అందించినట్లు ఛార్జ్ షీట్ లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. కాల్ రికార్డింగ్ ల విశ్లేషణలో.. బ్రిజ్ భూషణ్ బెదిరింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలిపారు. ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్న వారు విచారణకు సహకరిస్తే వారిని అరెస్ట్ చేయొద్దని గతంలో కోర్టు చెప్పిన తీర్పును ఢిల్లీ పోలీసులు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు.
అంతేకాకుండా.. తనకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తామని బ్రిజ్ భూషణ్ తమను బెదిరించాడని మహిళా రెజ్లర్లు గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, ఆ బెదిరింపు ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని తాము ఎన్నిసార్లు అభ్యర్థించినా.. మహిళా రెజ్లర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని ఢిల్లీ పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
కాగా, బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ (WFI) బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించినట్లు పలువురు మహిళా రెజ్లర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెండోసారి కొన్ని రోజుల పాటు నిరసనకు కూడా దిగారు.
మరోవైపు రెజ్లర్లు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దిగివచ్చారు. జూన్ 2న పలు సెక్షన్ల కింద బీజేపీ ఎంపీపై కేసులు నమోదు చేశారు. ఆయనపై నమోదైన ఆరు కేసుల్లో 108 మందిని విచారించినట్లు తెలిపారు. దీంతో గత వారం ఢిల్లీ కోర్టు బ్రిజ్ భూషణ్ కు సమన్లు జారీ చేసింది. కేసును విచారించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. జులై 18న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
Also Read..
IKEA India | యువతికి భయంకరమైన అనుభవం.. ఐకియా స్టోర్ లో డిజర్ట్ తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక
America | చెల్లిని తుపాకీతో కాల్చి చంపిన మూడేళ్ల చిన్నారి..!
Taapsee Pannu | నేనేమీ ప్రెగ్నెంట్ కాదు.. పెళ్లి గురించి అడిగితే తాప్సీ బోల్డ్ కామెంట్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

