America | అమెరికా (America)లో తుపాకీ సంస్కృతికి మరో చిన్నారి బలైంది. గన్ (Gun) అంటే ఏంటో తెలియని ఓ మూడేళ్ల చిన్నారి దాంతో ఆటలాడుతూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ ఘటనలో ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని కాలిఫోర్నియా (California) రాష్ట్రంలో సోమవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. శాన్ డియాగో కౌంటీ ఫాల్ బ్రూక్ (San Diego County) లో మూడేళ్ల చిన్నారి తన ఏడాదిన్నర చెల్లితో కలిసి ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న గన్ తీసుకుని ట్రిగ్గర్ నొక్కింది. దీంతో ఎదురుగా కూర్చున్న పాప తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగుల్లో పడి ఉన్న చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Taapsee Pannu | నేనేమీ ప్రెగ్నెంట్ కాదు.. పెళ్లిపై తాప్సీ బోల్డ్ కామెంట్స్
Heart Surgery | రోజుల బిడ్డకు గుండె ఆపరేషనా? పసిబిడ్డకు శస్త్రచికిత్స అవసరమా?
Jharkhand | పోలీసులపై క్రిమినల్ గ్యాంగ్ కాల్పులు.. ఏటీఎస్ డీఎస్పీ, ఎస్ఐకి తీవ్ర గాయాలు