గోల్డ్‌కోస్ట్: సుదీర్ఘ ఫార్మాట్లో సత్తాచాటిన భారత మహిళల జట్టు పొట్టి సిరీస్‌లోనూ అదే జోరు కనబర్చేందుకు సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం జరుగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. శనివారం రెండో పోరులో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. పేలవ ఫామ్‌తో వన్డే జట్టులో చోటు కోల్పోయిన టాపార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ టచ్‌లోకి రావడం భారత్‌కు సానుకూలాంశం కాగా.. గాయం కారణంగా ఏకైక టెస్టు (డే అండ్ నైట్)కు దూరమైన టీ20 కెప్టెన్ హర్మ్‌న్‌ప్రీత్ కౌర్ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమైంది. స్మృతి మందన, షఫాలీ, జెమీమా , హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తితో భారత్ బ్యాటింగ్ బలంగా ఉండగా.. హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డికి తుది జట్టులో చోటు దక్కుతుందో చూడాలి!
మధ్యాహ్నం 1.40 నుంచి సోనీ సిక్స్‌లో..