అడిలైడ్ : టీ-20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో ఆదివారం మూడు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే నెదర్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓటమి చెంది సెమీఫైనల్ ఆశలు గల్లంతు చేసుకుంది. అడిలైడ్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టాస్ గెలిచిన బంగ్లాదేశ్ 13ఓవర్లు ముగిసేనాటికి మూడు వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ ఓపెనర్ నిజముల్ హోసన్శాంతో 50 పరుగులతో అర్ధసెంచరీని పూర్తి చేసుకుని బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు . లిటన్‌దాస్ 10 పరుగులు, సౌమ్య సర్కార్20 పరుగులు. శాకిబ్అల్హసన్ పరుగులేమి చేయకుండా వెనుదిరిగాడు. పాకిస్తాన్ బౌలర్ సాధబ్ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా , అఫ్రిది ఒక వికెట్ తీసుకున్నారు.