కొలంబో: ఆసియాకప్(Asia Cup) సూపర్ ఫోర్ స్టేజ్‌లో ఇవాళ శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనున్నది. ఒకవేళ ఇవాళ వర్షం పడితే, అప్పుడు ఈ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి ఉంటుంది. ఇండియాతో ఎవరు ఫైనల్లో ఆడాలన్నా.. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ అయినా ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూపర్ ఫోర్ దశలో ఇండియా నాలుగు పాంయిట్లతో టాప్‌లో ఉంది. ఇక లంక, పాక్‌లు రెండేసి పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇవాళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక పాయింట్ ఇస్తారు. రిజర్వ్ డే లేని కారణంగా కచ్చితంగా ఫైనలిస్టును తేల్చాల్సి ఉంటుంది. అప్పుడు రెండు జట్లకు మూడేసి పాయింట్లు అవుతాయి. కానీ బెటర్ రన్‌రేట్ ఉన్న శ్రీలంక.. ఫైనల్లోకి వెళ్తుంది. ప్రస్తుతం శ్రీలంక నెట్ రన్ రేట్ -0.200గా ఉంది. ఇక పాకిస్థాన్ నెట్రన్ రేట్ -1.892గా ఉంది.