IPL 2025 : గంటకుపైగా ఉప్పల్ మైదానంలో కురిసిన వాన ఎట్టకేలకు తగ్గింది. 10:36కు చినుకులు ఆగిపోవడంతో మైదానం సిబ్బంది సూపర్ సాపర్ల(Super Soppers)ను బయటకు వచ్చారు. మరోవైపు అంపైర్లు ఎన్ని ఓవర్ల మ్యాచ్ సాధ్యం అవుతుంది?.. ఔట్ ఫీల్డ్‌ను ఎంత సేపట్లో సిద్ధం చేయగలరు? అనే విషయాలపై ఉప్పల్ స్టేడియం అధికారులతో చర్చించారు. అయితే.. బౌండరీ లైన్ వద్ద భారీగా నీళ్లు నిలిచి ఉన్నాయి. దాంతో, సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ మరింత ఆలస్యం కానుంది.
కాబట్టి ఓవర్లు కుదించే అవకాశం ఉంది. కనీసం 5 ఓవర్లు అయినా ఆడించాలని రిఫరీ, అంపైర్లు భావిస్తున్నారు. ఈ విషయంపై 23:42 వరకూ చూసి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ మళ్లీ చినుకులు పడి ఆట సాధ్యం కాకుంటే ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడి చెరొక పాయింట్ కేటాయిస్తారు. అదే జరిగితే ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీకి శరాఘాతమే. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే కట్డడి చేసిన కమిన్స్ సేనకు కూడా ఎక్కువ పాయింట్లతో టోర్నీని ముగించే అవకాశం చేజారుతుంది.
🚨 News 🚨
Start of the second innings of #SRHvDC has been delayed due to rain.
Stay tuned for further updates.#TATAIPL pic.twitter.com/liPLMLpWpz
— IndianPremierLeague (@IPL) May 5, 2025
సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్లు రెచ్చిపోయారు. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ నడ్డి విరిచారు. తొలుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3-19) మూడు వికెట్లతో దెబ్బకొట్టగా.. ఉనాద్కాట్ డేంజరస్ కేఎల్ రాహుల్(10)ను ఔట్ చేసి ఢిల్లీని పీకల్లోతు కష్టాల్లో ముంచాడు. 62కే 6 వికెట్లు పడిన వేళ ట్రిస్టన్ స్టబ్స్(41 నాటౌట్) ఇంప్యాక్ట్గా వచ్చిన అశుతోష్ శర్మ(41)లు ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడారు. డెత్ ఓవర్లలో ఈ జోడీ హైదరాబాద్ బౌలర్లను ఉతికేస్తూ బౌండరీలు రాబట్టి స్కోర్ 100 దాటించారు. ఏడో వికెట్‌కు 66 రన్స్ జోడించి గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మలింగ వేసిన 20వ ఓవర్ల్ స్టబ్స్ ఫోర్ బాదగా ఢిల్లీ 133 పరుగులు చేయగలిగింది.
A strong performance in the field from #SRH 👏
Followed by a spirited fightback from #DC 💪
🔽 🎥 RELIVE an entertaining first half of #SRHvDC | #TATAIPL
— IndianPremierLeague (@IPL) May 5, 2025