పెర్త్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న స్వదేశీ వన్డే టోర్నీలో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా(Western Australia) జట్టు కేవలం ఒక్క పరుగుకే 8 వికెట్లను కోల్పోయింది. టాస్మానియాతో జరిగిన మ్యాచ్లో.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఓ దశలో రెండు వికెట్ల నష్టానికి 52 రన్స్ చేసింది. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
డిఫెండింగ్ చాంపియన్ అయిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా కేవలం మరో పరుగు మాత్రమే జోడించి మిగితా 8 వికెట్లను కోల్పోయింది. ఓ దశలో 52-2గా ఉన్న ఆ జట్టు 53 రన్స్కే ఆలౌటైంది. టాస్మానియా బౌలర్ బివ్యూ వెబ్స్టర్ 17 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు.
వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఆరుగురు డకౌట్ అయ్యారు. ఆ టార్గెట్ను టాస్మానియా 8.3 ఓవర్లలో అందుకున్నది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఔటైన తీరుపై సోషల్ మీడియాలో చిత్రవిచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు.