దోహా: ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత యువ షూటర్ జొరావర్సింగ్ సంధుకు నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన పురుషుల ట్రాప్ ఫైనల్లో జొరావర్సింగ్ ఏడో స్థానంలో నిలిచాడు. వరల్డ్ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత అయిన జొరావర్ మొత్తం ఎనిమిది మంది షూటర్లతో కూడిన తుది పోరులో అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
అర్హత రౌండ్లో 119 స్కోరు చేసిన ఈ యువ షూటర్ ఆరో స్థానంతో ఫైనల్లోకి ప్రవేశించాడు. అయితే పతక పోరులో ప్రత్యర్థులకు దీటైన పోటీనివ్వలేకపోయాడు. ఇదిలా ఉంటే మెగాటోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు ఆరు పతకాలతో రెండో స్థానంతో ముగించింది.