Arshadeep Singh : భారత క్రికెట్ జట్టు (Indian cricket team) ఫాస్ట్ బౌలర్ (Pace bowler) అర్షదీప్ సింగ్ (Arshadeep Singh) శుక్రవారం సాయంత్రం చండీగఢ్ యూనివర్సిటీ (Chandigarh University) ని సందర్శించారు. కుటుంబంతో కలిసి యూనివర్సిటీకి వెళ్లిన ఆర్షదీప్ సింగ్‌కు అక్కడి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపు మీద ఆయనను ఊరేగించారు. రంగు కాగితాలు వెదజల్లి సంబురాలు చేసుకున్నారు.
#WATCH | Chandigarh: Indian Cricketer Arshdeep Singh visits Chandigarh University. He receives a grand welcome from the students and officials. pic.twitter.com/rcqrOVdoTo
— ANI (@ANI) July 19, 2024
కాగా, ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ టైటిల్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు సొంతం చేసుకుంది. జట్టు విజయంలో అర్షదీప్ సింగ్ కీలక పాత్ర పోషించారు. పంజాబ్‌కు చెందిన అర్షదీప్‌కు స్వదేశానికి రాగానే ఘన స్వాగతం లభించింది. పంజాబ్ ప్రజలు ఆయనను ఘనంగా స్వాగతించారు. ఈ క్రమంలో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తొలిసారి అర్షదీప్ చండీగఢ్ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనను ఘనంగా స్వాగతించారు.