NZ vs UAE : టీ20 ప్రపంచకప్‌లో చిన్న జట్లు చెలరేగిపోతున్నాయి. సంచలన ప్రదర్శనతో పెద్ద జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. చెన్నైలో పటిష్టమైన న్యూజిలాండ్‌కు యూఏఈ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్ ముహమ్మద్ వసీం() కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా.. అలీషన్ షరాఫు(55) హాఫ్ సెంచరీతోచెలరేగాడు. కివీస్ పేస్, స్పిన్ దళాన్ని ఉతికారేసిన ఈ ద్వయం విధ్వంసంతో 15 ఓవర్లకే స్కోర్ 120 దాటింది. ఆఖర్లో మయాంక్ కుమార్(21) దంచేశాడు. చివరి ఓవర్లో వరుసగా రెండు వికెట్లు పడడంతో యూఏఈ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈకి బ్యాటర్లు భారీ స్కోర్ అందించారు. జాకబ్ డఫ్పీ తన మొదటి ఓవర్లోనే ఓపెనర్ అయాన్ష్ శర్మ(8)ను వెనక్కి పంపి న్యూజిలాండ్‌కు బ్రేకిచ్చాడు. తొలి వికెట్ తీసి ఉత్సాహంలో ఉన్న కివీస్ జట్టును ముహమ్మద్ వసీం(64 నాటౌట్), అలీషాన్ షరాఫు(55)లు బెంబేలెత్తించారు. బౌండరీలతో విరుచుకుపడిన ఈ ద్వయం జోరుతో 12 ఓవర్లకే యూఏఈ స్కోర్ 120 దాటింది.
The most expensive over of the tournament so far: 27 runs 🔥 pic.twitter.com/a3VMTrWeSK
— ESPNcricinfo (@ESPNcricinfo) February 10, 2026
ఈ ప్రమాదకరమైన జోడీని మిచెల్ శాంట్నర్ విడదీసి బ్లాక్క్యాప్స్కి ఊరటనిచ్చాడు. హర్షిత్ కౌశిక్(2) విఫలమవ్వగా.. మయాంక్ కుమార్ (21) ధనాధన్ ఆటతో రెచ్చిపోయాడు. ఫిలిప్స్ వేసి18వ ఓవర్లో ఏకంగా7 రన్స్ పిండుకున్నాడు. అతడు 4, 6, 4, 6 బాదగా.. నోబాల్ బౌండరీ వచ్చింది. 19వ ఓవర్లోనూ ఒక బౌండరీ రాగా యూఏఈ స్కోర్ 160 దాటింది. చివరి ఓవర్లో చివరి రెండు బంతులకు వికెట్లు పడడంతో యూఏఈ 173 పరుగులకే పరిమితమైంది.