Wasim Khan | ఐసీసీలో కీలక పదవికి వాసీమ్ ఖాన్ రాజీనామా.. పదవీకాలం ముగియకుండానే ఎందుకు..?
Wasim Khan | పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ Wasim Khan) ఐసీసీ (ICC) కీలక పదవి నుంచి వైదొలిగారు. ఐసీసీలో జనరల్ మేనేజర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన తాజాగా ఆ పదవిని వీడారు. 2022లో జెఫ్ అల్లార్డెస్ నుంచి వాసీమ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు.
Wasim Khan : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ Wasim Khan) ఐసీసీ (ICC) కీలక పదవి నుంచి వైదొలిగారు. ఐసీసీలో జనరల్ మేనేజర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన తాజాగా ఆ పదవిని వీడారు. 2022లో జెఫ్ అల్లార్డెస్ నుంచి వాసీమ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు 2019 నుంచి మూడేళ్లపాటు ఆయన పీసీబీ సీఈవోగా పనిచేశారు. అయితే ఇప్పుడు ఐసీసీ జనరల్ మేనేజర్ పదవి నుంచి వైదొలిగినా.. జూన్ నెలాఖరులో ఖాన్ మరో పదవీ బాధ్యతలను తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
గత రెండేళ్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వివిధ కారణాలతో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులు తమ పదవులను వీడుతున్నారు. అల్లార్డెస్‌తోపాటు యాంటీ కరప్షన్ యూనిట్‌కు చెందిన క్రిస్ టెట్లీ (ఈవెంట్స్ హెడ్), అలెక్స్ మార్షల్ తమ పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానంలో గౌరవ్ సక్సేనా, ఆండ్రూ వచ్చి చేరారు. ఇప్పుడు వాసిమ్‌ఖాన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. పాక్ క్రికెట్ బోర్డులో కీలక బాధ్యతలు చేపట్టిన వాసీమ్ ఇంగ్లండ్‌లో జన్మించడం గమనార్హం. అక్కడే తన క్రికెట్ కెరీర్‌ను మొదలుపెట్టాడు.
వాసీం ఖాన్1995 నుంచి 2001 వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్లో, 1998 నుంచి 2002 వరకు లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో ఆడాడు. 1995లో వార్విక్షైర్ కౌంటీ టైటిల్ గెలుచుకున్న జట్టులో అతను సభ్యుడిగా ఉన్నారు. పాకిస్థాన్ మూలాలు ఉన్నప్పటికీ, అతను పాక్ జట్టు తరఫున ఒక్క మ్యాచూ ఆడలేదు. కానీ పీసీబీకి సీఈవోగా పనిచేయడం గమనార్హం. ఐసీసీ జనరల్ మేనేజర్ గా గత నాలుగేళ్లుగా సేవలందిస్తున్న వాసిమ్ ఖాన్, తాజాగా తన పదవి నుంచి తప్పుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ICC
- PCB
- sports news
- Wasim Khan
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

