కిసీ ఔర్ ప్లానెట్ సే ఆయా హై.. ఇండియన్ బ్యాటర్‌పై వసీం అక్రమ్ ప్రశంసలు
Wasim Akram:టీ20 వరల్డ్‌కప్‌లో సూర్యకుమార్ యాదవ్.. టాక్ ఆఫ్ ద టోర్నీగా మారాడు. సూర్య ఆడుతున్న తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. అతను కొట్టే షాట్లకు బౌలర్లు అయితే కళ్లు తేలేస్తున్నారు. ఎలా బౌలింగ్ చేయాలో కూడా వాళ్లకు అర్థం కావడం లేదు. ఎటు వేసినా అటు ఈజీగా సూర్య దంచేస్తున్నాడు. గత నాలుగు మ్యాచుల్లో సూర్య మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో 225 రన్స్ చేశాడు. టోర్నీలో అత్య
మెల్బోర్న్: టీ20 వరల్డ్‌కప్‌లో సూర్యకుమార్ యాదవ్.. టాక్ ఆఫ్ ద టోర్నీగా మారాడు. సూర్య ఆడుతున్న తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. అతను కొట్టే షాట్లకు బౌలర్లు అయితే కళ్లు తేలేస్తున్నారు. ఎలా బౌలింగ్ చేయాలో కూడా వాళ్లకు అర్థం కావడం లేదు. ఎటు వేసినా అటు ఈజీగా సూర్య దంచేస్తున్నాడు. గత నాలుగు మ్యాచుల్లో సూర్య మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో 225 రన్స్ చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన మూడవ బ్యాటర్ అతను. ఇక అతని స్ట్రయిక్ రేటు 193.96గా ఉంది.ఆ జోరుతో బ్యాటింగ్ చేస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు.
సూర్య హిట్టింగ్‌పై పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించారు. ముజే తో లగ్ రహా యే కిసీ ఔర్ ప్లానెట్ సే ఆయా హై(అతను మరో గ్రహం నుంచి వచ్చినట్లు ఉంది) అని అన్నారు. ఇతర క్రికెటర్లతో అతన్ని పోల్చేమని వసీం కితాబు ఇచ్చారు. టీ20ల్లో అతను స్కోర్ చేసిన రన్స్ ఆశ్చర్యమే అన్నారు. 2022లో సూర్య టీ20ల్లో వెయ్యి పరుగులు చేశాడని, అతని బ్యాటింగ్‌ను చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు. కేవలం జింబాబ్వేపైన మాత్రమే కాదు, ఉత్తమ బౌలర్లను కూడా అతను బాదిన తీరు ఆకర్షణీయంగా ఉందన్నారు.
ఎటువంటి భయంలేకుండా సూర్య షాట్లు కొడుతున్నట్లు వసీం తెలిపారు. బంతి శరీరానికి తగులుతుందన్న భయం కూడా లేదు అని, అతని ఆటను చూస్తుంటే ఆనందంగా ఉందని అక్రమ్ చెప్పారు. సూర్య బ్యాటింగ్ స్టయిల్ చూస్తుంటే అతనికి బౌల్ ఎక్కడ వేయాలో బౌలర్లకు అర్థం కావడం లేదన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

