Wasim Akram : పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ (Wasim Akram) చిక్కుల్లో పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్(Online Betting App)లను ప్రోత్సహిస్తున్నందుకు ఈ లెజెండరీ ఆటగాడిపై సైబర్ క్రైమ్ (Cyber Crime)విభాగంలో కేసు నమోదైంది. క్రీడలకు సంబంధించిన ఒక గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేస్తున్న అక్రమ్‌పై మంగళవారం ముహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
సోషల్ మీడియాలోని ఒక వీడియో క్లిప్‌లో వసీం అక్రమ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారకర్తగా ఉన్నారు. క్రికెట్ అభిమానులకే కాకుండా ఇతరులను కూడా ఆకర్షించేలా ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నారు ఆయన అని ఫయాజ్ తన కంప్లైట్‌లో పేర్కొన్నాడు. విదేశీ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న అక్రమ్‌పై చర్యలు తీసుకోవాలని లాహోర్‌లోని సైబర్ నేర పరిశోధన విభాగాన్ని కోరాడతడు.
𝐖𝐚𝐬𝐢𝐦 𝐀𝐤𝐫𝐚𝐦 𝐚𝐜𝐜𝐮𝐬𝐞𝐝 𝐨𝐟 𝐩𝐫𝐨𝐦𝐨𝐭𝐢𝐧𝐠 𝐨𝐧𝐥𝐢𝐧𝐞 𝐠𝐚𝐦𝐛𝐥𝐢𝐧𝐠 𝐚𝐩𝐩: 𝐑𝐞𝐩𝐨𝐫𝐭𝐬
Former Pakistan captain #WasimAkram faces a legal complaint in #Lahore for allegedly endorsing a foreign online betting app, with authorities confirming an… pic.twitter.com/7aPghVwf0c
— IndiaToday (@IndiaToday) August 19, 2025
అయితే.. తనపై కేసు నమోదైన విషయంపై పాక్ దిగ్గజం ఇంకా స్పందించలేదు. వసీం అక్రమ్ ‘బజీ ‘(BAJI) అనే యాప్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. క్రీడలు, క్యాసినో(Casino)కు సంబంధించిన ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ బంగ్లాదేశ్‌లో పాపులర్. పాక్ వెటరన్ పేసర్ అయిన అక్రమ్ 2002లో టెస్టులకు, 2003 వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం అతడు కామెంటేటర్‌గా అభిమానులను అలరిస్తున్నాడు.