దుబాయ్: టీ20 వరల్డ్‌కప్ రెండవ సెమీస్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా స్టన్నింగ్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ మూమెంట్ చోటుచేసుకున్నది. పాకిస్థాన్ ఆల్‌రౌండర్ హఫీజ్ బౌలింగ్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ గమ్మత్తైన షాట్ కొట్టాడు. ఇన్నింగ్స్‌లో 8వ ఓవర్ వేసిన హఫీజ్ తన తొలి బంతిని వార్నర్‌కు బౌల్ చేశాడు. అయితే ఆ బంతి కాస్త పిచ్‌పై రెండు సార్లు బౌన్స్ అయ్యింది. భారీ షాట్ కొట్టేందుకు ముందుకు వచ్చిన వార్నర్.. రెండు సార్లు బౌన్స్ అయిన ఆ బంతిని భారీ షాట్‌తో సిక్సర్‌గా మలిచాడు. ఆ షాట్ చూసిన పాక్ కెప్టెన్ బాబర్ ఖంగుతిన్నాడు. బౌలర్ హఫీజ్ చేతి నుంచి బంతి జారడంతో అది కాస్త రెండు స్టెప్పులు తిన్నది. కానీ వార్నర్ మాత్రం ఆ బంతిని వదలలేదు. అంతేకాదు, ఆ బాల్‌ను అంపైర్ నోబాల్‌గా ప్రకటించారు. దీంతో పాకిస్థాన్‌కు మరింత కష్టాలు ఎదరయ్యాయి. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆఖర్లో మాథ్యూ వేడ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి.. పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు. వార్నర్ 49 రన్స్ చేసి ఔటయ్యాడు.