హనుమకొండ చౌరస్తా, జనవరి 1 : లక్నో వేదికగా ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు జరిగే ఐహెచ్ఎఫ్ పురుషుల కాంటినెంటల్(ఆసియా) టోర్నీకి హనుమకొండకు చెందిన బొడ్డు విష్ణువర్ధన్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్ఏఐ) సంయుక్త కార్యదర్శి తేజ్రాజ్సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోచ్‌గా ఎంపికైనందుకు సహకరించిన హెచ్ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనందీశ్వర్‌పాండే, హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు, సాట్స్ ఎండీ సోనీబాలదేవి, హనుమకొండ డీవైఎస్వో అశోక్‌కుమార్‌కు విష్ణు కృతజ్ఞతలు తెలిపాడు. హనుమకొండ డీఎస్ఏ కోచ్‌గా విష్ణు 8 ఏండ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.