Virat Kohli : అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ (Kane Williamson)కు విరాట్ కోహ్లీ (Virat Kohli ) అభినందనలు తెలియజేశాడు. తన స్నేహితుడైన విలియమ్సన్ ఆటకు అల్విదా చెప్పడంపై భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టాడు విరాట్. ఫ్యాబ్ 4లో ఒకడైన కేన్ మామతో మైదానంలో తలపడిన రోజులను గుర్తు చేసుకున్న కోహ్లీ.. మిత్రమా అభినందనలు.. నీ జీవితం ఇప్పుడే మొదలైంది అని రాసుకొచ్చాడు.
ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ వార్తతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. లార్డ్స్ టెస్టులో ఘోర పరాభవాన్ని తట్టుకోలేక వీడ్కోలు చెప్పేసిన కివీస్ మాజీ కెప్టెన్‌కు భారత స్టార్ కోహ్లీ అభినందనలు తెలిపాడు. ఆధునిక యుగంలో 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ముగించిన తన స్నేహితుడితో కలిసి క్రికెట్ ఆడిన రోజులను యాది చేసుకున్నాడు విరాట్.
From an opponent to a friend over the years. It’s been a pleasure watching you bat and compete against you over so many years but more than that I value our friendship and shared perspectives on the game and beyond. I continue to cherish every time we speak or meet. Wishing you…
— Virat Kohli (@imVkohli) June 12, 2026
‘కొన్నేళ్లుగా మైదానంలో ప్రత్యర్థి నుంచి మంచి స్నేహితుడు. నీ ఆటను చూడడం, నీ ప్రత్యర్ధిగా ఆడడం చాలా అద్భుతం. మన స్నేహానికి నేను ఎంతో విలువిచ్చాను. ఆటకు సంబంధించి మన ఆలోచనలను ఒకరికొకరం పంచుకున్నాం. మనం మాట్లాడుకున్నప్పుడు ఎంతో సంతోషం వేసేది. సోదరుడా నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. అన్నీ ఆస్వాదించడానికి నీవు అర్హుడవు. సో.. సగర్వంగా ముందుకు సాగు. చెప్పాలంటే నీ జీవితం ఇప్పుడే మొదలైంది’ అని కోహ్లీ తన పోస్ట్‌లో వెల్లడించాడు. 2021-23 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియాను ఓడించిన కేన్ న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపాడు.

అండర్-19 హీరోలుగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కోహ్లీ, విలియమ్సన్ పోటీపడి పరుగులు సాధించారు. క్లాస్ ఆటతో అభిమానగణాన్ని పోగేసుకున్న వీరిద్దరూ ఫ్యాబ్ 4లో స్టీవ్ స్మిత్, జో రూట్‌తో పాటు చోటు సాధించారు. తన 16 ఏళ్ల కెరీర్లో విలియమ్సన్ మూడు ఫార్మాట్లలో కివీస్ జెర్సీతో మైదానంలోకి దిగాడు. టెస్టుల్లో టన్నుల కొద్దీ రన్స్, రికార్డు శతకాల(33)తో రెచ్చిపోయిన్ ఈ స్టార్ ఆటగాడు 110 మ్యాచుల్లో 9,515 పరుగులు బాదేశాడు. 93 టీ20ల్లో 2,575 పరుగులు, 175 వన్డేల్లో 7,256 రన్స్ కొట్టాడు.