గురువారం 02 జూలై 2020
Sports - May 04, 2020 , 22:35:50

కోహ్లీ సంబరాలు చూసి రెచ్చిపోయా: రసెల్​

కోహ్లీ సంబరాలు చూసి రెచ్చిపోయా: రసెల్​

న్యూఢిల్లీ: గతేడాది చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్ విశ్వరూపం చూపాడు. 206 పరుగుల లక్ష్యఛేదనలో ఓ సమయంలో కోల్​కతా విజయం సాధించేందుకు 15 బంతుల్లో 52 పరుగులు పరుగులు చేయాల్సిన పరిస్థితి. అప్పుడు రసెల్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. సిక్సర్ల మోత మోగించి 13 బంతుల్లోనే 48 పరుగులు చేసి జ్టటును గెలిపించాడు. ఆ అద్భుత ఇన్నింగ్స్​పై రసెల్ తాజాగా ఇన్​స్టాగ్రామ్ లైవ్​లోమాట్లాడాడు. కేకేఆర్ కెప్టెన్​ దినేశ్ కార్తీక్​ క్యాచ్​ను పట్టాక   బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసుకున్న సంబరాలే  తాను మరింత రెచ్చిపోయి ఆడేలా చేశాయని రసెల్ తెలిపాడు.

“దినేశ్ కార్తీక్ బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత ఓ బంతిని బాదగా క్యాచ్ ఔటయ్యాడు. అప్పుడు కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ వైపు, కోల్​కతా మద్దతుదారుల వైపు తిరిగి  విరాట్ కోహ్లీ గట్టిగా అరిచి సంబరాలు చేసుకున్నాడు. అది చూశాక నేను బ్యాటింగ్​లో మరింత రెచ్చిపోవాలనుకున్నా. మ్యాచ్ ఇంకా ముగియలేదనుకున్నా. కార్తీక్ తర్వాత వచ్చిన శుభ్​మన్​కు నాకే ఎక్కువగా స్ట్రయిక్ ఇవ్వాలని చెప్పా. ఆ తర్వాత సిక్సర్ల మీద సిక్సర్లు బాదేశా. స్కోరు బోర్డును కూడా చూడలేదు” అని రసెల్ చెప్పాడు. ఆ మ్యాచ్​లో చివరికి కోల్​కతా నైట్​రైడర్స్​  ఐదు బంతులు మిగిలి ఉండగానే.. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 


logo