చెన్నై: వన్డే ప్రపంచకప్ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2023 వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మూడో ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ అందుకోవడం ద్వారా అత్యధిక క్యాచ్‌ల రికార్డు విరాట్ సొంతమైంది.
ఇవాళ్టి క్యాచ్‌తో కలిపి వన్డే ప్రపంచకప్ క్రికెట్లో కోహ్లీ పట్టిన క్యాచ్‌ల సంఖ్య 15కు చేరింది. దాంతో కుంబ్లే 14 క్యాచ్‌ల రికార్డు బద్ధలైంది. ఇప్పటివరకు 14 క్యాచ్‌లతో కుంబ్లే, కోహ్లీ సమంగా ఉన్నారు. ఇప్పుడు కుంబ్లేను కోహ్లీ దాటేశాడు. ఇక కపిల్ దేవ్ 12 క్యాచ్‌లు, సచిన్ టెండూల్కర్ 12 క్యాచ్‌లు వారి తర్వాత స్థానాల్లో ఉన్నారు.