Virat Kohli | ఒంటరిగా కూర్చుని ఏడవలేను.. బీసీసీఐపై విరాట్ కోహ్లీ ఫైర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు వైఫల్య ప్రదర్శన అనంతరం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకొచ్చిన నిబంధలలో భాగంగా.. ఆటగాళ్ల కుటుంబాలను విదేశీ టోర్నీలకు తీసుకెళ్లే విషయంలో బోర్డు విధించిన ఆంక్షలపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
- బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
Virat Kohli | బెంగళూరు : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు వైఫల్య ప్రదర్శన అనంతరం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకొచ్చిన నిబంధలలో భాగంగా.. ఆటగాళ్ల కుటుంబాలను విదేశీ టోర్నీలకు తీసుకెళ్లే విషయంలో బోర్డు విధించిన ఆంక్షలపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్లకు కష్టసమయాల్లో కుటుంబ మద్దతు ఎంతో అవసరమని, తానైతే హోటల్ రూమ్‌లో ఒంటరిగా కూర్చుని ఏడవలేనని కోహ్లీ వ్యాఖ్యానించాడు. శనివారం బెంగళూరులో జరిగిన ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ సమ్మిట్‌లో కోహ్లీ మాట్లాడుతూ.. ‘కుటుంబం పాత్ర గురించి, వాళ్లు ఇచ్చే మద్దతు గురించి కొంతమందికి ఎంతచెప్పినా అర్థం కాదు.
మ్యాచ్‌లో ఎంతో తీవ్రతతో ఆడుతుంటాం. ఆట పూర్తికాగానే కుటుంబం చెంతకు చేరితే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అది ఆటగాళ్లకు చాలా అవసరం. అంతేగానీ మ్యాచ్ ముగిశాక హోటల్ రూమ్‌లోకి ఒక్కడే వెళ్లి విచారిస్తూ కూర్చోవాలా? నేనైతే అలా చేయలేను. ఆట ముగిసినా నేను సాధారణంగానే ఉండాలని కోరుకుంటా. కుటుంబంతో గడిపే ఏ ఒక్క క్షణాన్ని నేను వదులుకోను’ అని కుండబద్దలు కొట్టాడు. 45 రోజుల విదేశీ పర్యటనలైతే రెండు వారాలు మాత్రమే కుటుంబాలకు అనుమతినిచ్చిన బీసీసీఐ.. చిన్న టూర్లకు తీసుకెళ్లకపోవడమే మంచిదన్నట్టు సూచించింది. ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత ఆటగాళ్ల కుటుంబాలు దుబాయ్‌లో ఉన్నప్పటికీ వారంతా క్రికెటర్లతో కాకుండా ఇతర హోటళ్లలో ఉండాల్సి వచ్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

