Virat Kohli | ఆమెతో డేటింగ్.. నా జీవితాన్ని మార్చేసింది : కోహ్లీ
టీమిండియా స్టార్ ప్లేయర్ (Virat Kohli) విరాట్ కోహ్లీ తన జీవితాన్నిమార్చేసిన క్షణం గురించి చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ పోడ్కాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుతూ... భార్య (Anushka Sharma) అనుష్కా శర్మను కలవడం, ఆమెతో డేటింగ్ చేయడం తన లైఫ్ ఛేంజింగ్ మూమెంట్స్ అని ఈ రికార్డుల రారాజు తెలిపాడు.
Virat Kohli : టీమిండియా స్టార్ ప్లేయర్ (Virat Kohli) విరాట్ కోహ్లీ ఏ విషయంపై అయినా మొహమాటం లేకుండా మాట్లాడుతుంటాడు. ఈ లెజెండరీ (crickter) క్రికెటర్ వారం క్రితం తన ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (rcb podcast) పోడ్కాస్ట్ ఎపిసోడ్లో సంచలన విషయాలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా తన జీవితాన్నిమార్చేసిన క్షణం గురించి కింగ్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. భార్య (Anushka Sharma) అనుష్కా శర్మను కలవడం, ఆమెతో డేటింగ్ చేయడం తన లైఫ్ ఛేంజింగ్ మూమెంట్స్ అని ఈ రికార్డుల రారాజు తెలిపాడు. ఈ వీడియోను ఆర్సీబీ (rcb )గురువారం ట్విట్టర్లో షేర్ చేసింది.
కోహ్లీ తన జీవితాన్ని మార్చేసిన గొప్ప క్షణం గురించి ఇలా వివరించాడు. ‘అనుష్క శర్మను కలిశాక మునుపెన్నడు లేని విధంగా నా ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. ఆమెతో డేటింగ్ చేశాక నేను పూర్తిగా మారిపోయాను. ఓపెన్గా మాట్లాడడం, కొత్త సలహాలను స్వీకరించడం వంటివి అలవర్చుకున్నా. ఎందుకంటే.. ప్రేమలో పడ్డాక మార్పు దానంతటదే వస్తుంది. కలిసి తిరగడం, కబుర్లు చెప్పుకోవడం వంటివి ఉంటాయి. అందుకని మనసులో ఉన్నది బయటకు చెప్పడంతో పాటు చాలా విషయాలను ఒప్పుకోవాల్సి వస్తుంది’ అని కోహ్లీ చెప్పాడు. అంతేకాదు తన తండ్రి మరణాంతర పరిస్థితుల గురించి కూడా అతను మాట్లాడాడు.
ఆటపై ఫోకస్ పెట్టా
మా నాన్న చనిపోయాక పరిస్థితులు చాలా మారాయి. కానీ, నా లైఫ్ పెద్దగా మారలేదు. మునపటిలానే ఉంది. అయితే.. నాన్న మరణం తర్వాత నేను మరింత బలంగా తయారయ్యా. ఆయన నన్ను గొప్ప క్రికెటర్గా చూడాలనుకున్నారు. అందుకుని ఆటపై మరింత దృష్టి పెట్టా అని కోహ్లీ వివరించాడు. ఒక ప్రకటనలో అనుష్కా శర్మతో కలిసి నటించిన కోహ్లీ ఆమెతో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగిన ఈ జంట 2017లో వివాహం చేసుకుంది. వీళ్లకు వామిక అనే కూతురు ఉంది.
రాత మారేనా..?
ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి కోహ్లీ ఆర్సీబీకి ఆడుతున్నాడు. కానీ, ఆ జట్టు ఇప్పటి వరకు ట్రోఫీ గెలవలేదు. రెండు సార్లు ఫైనల్ చేరింది. దురదృష్టం వెంటాడడంతో ఓటమి పాలైంది. గత సీజన్లో విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో డూప్లెసిస్కు పగ్గాలు అప్పగించారు. పదహారో సీజన్ మార్చి 31న ప్రారంభం కానుంది. మరి, ఈ సీజన్లో ఆర్సీబీ రాత మారుతుందా? లేదా? అనేది చూడాలి.
Virat talks about how his life changed after meeting Anushka Sharma on @eatsurenow presents #RCBPodcast! 💖#PlayBold @imVkohli @danishsait pic.twitter.com/90JHI5ESkr
— Royal Challengers Bangalore (@RCBTweets) March 9, 2023
ఇవి కూడా చదవండి
Mumbai Indians | మహానగరాన్ని తలపించేలా ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ.. వావ్ అంటున్న ఫ్యాన్స్
Ravichandran Ashwin | సొంత గడ్డపై ఒకే ఒక్కడు.. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

