Virat Kohli | విద్యార్థులు నిబద్ధతతో కలలను సాకారం చేసుకోవాలి : విరాట్ కోహ్లీ
Virat Kohli | విద్యార్థులు నిజాయితీ, నిబద్ధతతో తమ కలలను సాకారం చేసుకోవాలని క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli) అన్నారు.
ఢిల్లీ : విద్యార్థులు నిజాయితీ, నిబద్ధతతో తమ కలలను సాకారం చేసుకోవాలని క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli) అన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఆర్కే పురం డీపీఎస్ (Delhi Public School)లో జరిగిన క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. విద్యార్థులు చదువును గౌరవించాలన్నారు. చిన్ననాటి తన పాఠశాల అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
క్రికెట్ను తన కెరీర్ మార్గంగా ఎంచుకున్నప్పుడు తన ప్రాధాన్యతలు చిన్నప్పుడే ఎలా మారాయో విద్యార్థులకు విరాట్ వివరించారు. నాకు పాఠశాలల్లో మాట్లాడటం అలవాటు లేదన్నారు. ఇది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఎందుకంటే నేను క్రికెట్ కోసం చాలా కాలం క్రితమే పాఠశాల వాతావరణానికి దూరమయ్యానని పేర్కొన్నారు. పాఠశాల అనేది మీరు నేర్చుకోవడానికి, ఎదగడానికి, మంచి వ్యక్తులుగా మారడానికి అత్యుత్తమైన వేదిక అన్నారు.
విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ఎంతో కృష్టి చేస్తారన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని తీర్చిదిద్దడంలో వారి పాత్ర ప్రశంసనీయమన్నారు. వారు తమ జీవితంలో కొంత భాగాన్ని మీకు కోసం కేటాయిస్తున్నారు. మీ ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

