Virat Kohli : రన్ మెషీన్, రికార్డ్ బ్రేకర్.. ఇలా ఎన్నో ఉపమానాలున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) కెరీర్లో క్లిష్టమైన పరిస్థితిని ఘనంగా అధిగమించాడు. సిడ్నీలో అర్ధ శతకంతో విరుచుకుపడి ఆస్ట్రేలియా పర్యటనను ముగించాడు. వరుసగా రెండు డకౌట్స్ తర్వాత.. అభిమానులను అలరించే ఇన్నింగ్స్ ఆడాడు విరాట్. సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచిన కోహ్లీ.. సహచరుడు రోహిత్ శర్మతో కలిసి.. అజేయంగా జట్టును గెలిపించాడు. 74 పరుగులతో రాణించిన కింగ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఛేజింగ్ తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసుకొస్తుందని అన్నాడు.
సీడ్నీలో ఏమంత గొప్ప రికార్డు లేని విరాట్.. ఈసారి అర్థ శతకంతో చెలరేగాడు. గతంలో ఈ వేదికపై ఏడు మ్యాచుల్లో ఒకేఒక ఫిఫ్టీతో సరిపెట్టుకున్న అతడు.. ఫామ్ అందుకుంటూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ పూర్తయ్యాక కామెంటేటర్లు రవిశాస్త్రి, ఆడం గిల్‌క్రిస్ట్‌లతో మాట్లాడిన కోహ్లీ.. తన ప్రదర్శన గురించి.. రోహిత్‌తో భాగస్వామ్య బంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
Rohit Sharma and Virat Kohli were at their fluent best in the final ODI against Australia 🙌#AUSvIND 📝: https://t.co/gElymMZkV6 pic.twitter.com/1fvga26qnV
— ICC (@ICC) October 25, 2025
‘సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడినా సరే.. ప్రతి మ్యాచ్ మనకు కొత్త సవాళ్లు విసురుతుంది. రెండు డకౌట్స్ కూడా అంతే. కానీ, నేను ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మరికొన్ని రోజుల్లో నాకు 37 ఏళ్ల వస్తాయి. అయితే.. ఛేదనకు దిగానంటే నాలోని అత్యుత్తమ ఆట ఆడుతాను. రోహిత్‌తో కలిసి జట్టును గెలిపించే భాగస్వామ్యం నెలకొల్పినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని కోహ్లీ వెల్లడించాడు.
Virat Kohli and Rohit Sharma post match interview ❤️ pic.twitter.com/xfi9nCJCKH
— Abhinav (@KohliArchives) October 25, 2025
హిట్‌మ్యాన్‌తో భాగస్వామ్యం నెలకొల్పడం గురించి మాట్లాడుతూ.. ‘మొదటి నుంచి మేము పరిస్థితిని అర్థం చేసుకున్నాం. ప్రతిసారి మేము చేసేది అదే. ప్రస్తుతం క్రికెట్లో అత్యంత అనుభవం కలిగిన జోడీ మాది. పెద్ద భాగస్వామ్యాలతో జట్టును గెలిపించగలమని మాకు తెలుసు. 2013లో ఆస్ట్రేలియాపైనే మా ద్వయం హిట్టైంది. ఈ దేశానికి రావడం చాలా నచ్చుతుంది. ఇక్కడ చాలా మంచి క్రికెట్ ఆడాం. భారీ సంఖ్యలో విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహించినందుకు అభిమానులకు ధన్యవాదాలు’ అని తన అనుబంధాన్ని పంచుకున్నాడు.
𝙎𝙮𝙙𝙣𝙚𝙮 𝙎𝙥𝙚𝙘𝙩𝙖𝙘𝙡𝙚 🍿
Rohit Sharma 🤝 Virat Kohli
This was their 12th 1️⃣5️⃣0️⃣+ partnership in ODI’s which is the joint most in the format 🔥
Scorecard ▶ https://t.co/4oXLzrhGNG#TeamIndia | #3rdODI | #AUSvIND | @ImRo45 | @imVkohli pic.twitter.com/GWO75BjYez
— BCCI (@BCCI) October 25, 2025
ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల ఛేదనలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(24) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్ జతగా స్కోర్‌బోర్డును ఉరికించాడు. ఇద్దరూ చక్కని సమన్వయంతో ఆడుతూ.. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ కంగారూలను విసిగించారు. క్రీజులో చరుకుగా కదిలిన రోకో.. మునపటిలా ఆడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఫామ్ అందుకున్న రన్ మెషీన్ కూపర్ క్రాన్లీ ఓవర్లో సింగిల్ తీసి వన్డేల్లో 75వ అర్ధ శతకం సాధించాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. కుమార సంగక్కర (Kumar Sangakkara) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బద్ధలు కొట్టాడీ స్టార్ క్రికెటర్. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 14,235 రన్స్ ఉండగా.. టాప్ స్కోరర్‌గా సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు.
𝐑𝐮𝐧 𝐌𝐚𝐜𝐡𝐢𝐧𝐞 🔢
Virat Kohli surpassed Kumar Sangakkara in the tally for Most Runs in ODI cricket history 🫡
Scorecard ▶ https://t.co/4oXLzrhGNG#TeamIndia | #3rdODI | #AUSvIND | @imVkohli pic.twitter.com/bf9lnynpn2
— BCCI (@BCCI) October 25, 2025
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా పేరొందిన మాస్టర్ బ్లాస్టర్ 18,426 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే.. వన్డేలు, టీ20లు కలిపితే.. సచిన్ కంటే కోహ్లీ(18,437)నే ఒక పరుగు ముందున్నాడు. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ 13,704 పరుగులతో మూడో నాలుగో స్థానంలో నిలిచాడు.వన్డేల్లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు.