దుబాయ్: ఇండియన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ కొట్టేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. 37 ఏళ్ల కోహ్లీ .. 2021 జూలై తర్వాత మళ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. మాజీ కెప్టెన్ రోహిత్ వర్మ వన్డే బ్యాటింగ్‌లో మూడవ స్థానానికి పడిపోయాడు. కోహ్లీ ఫస్ట్ వన్డేలో కివీస్‌పై 93 రన్స్ స్కోరు చేశాడు. దీంతో అతను వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఫస్ట్ లో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు.
కోహ్లీ తన చివరి అయిదు ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 74, 135, 102 స్కోర్ చేశాడు. ఇక సఫారీలతో ఓ మ్యాచ్‌లో 65, కివీస్‌తో ఫస్ట్ మ్యాచ్‌లో 93 స్కోరు చేశాడు. అక్టోబర్ 2013లో కోహ్లీ తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఇక ఆ పొజిషన్లో మొత్తం 11 సార్లు అతను టాప్ ప్లేస్‌లో నిలిచాడు. కోహ్లీ తన కెరీర్లో 825 రోజుల పాటు వన్డే టాప్ బ్యాటర్‌గా నిలిచాడు. శుభమన్ గిల్ అయిదవ స్థానంలో, శ్రేయాస్ అయ్యర్ టాప్ 10లో ఉన్నాడు.
India’s linchpin regains top spot after hitting a purple patch in ODIs 🔝
More on the latest ICC Men’s rankings 👇https://t.co/IKDkNetwgG
— ICC (@ICC) January 14, 2026