హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో.. క్రికెటర్ శుభమన్ గిల్ మెరుపు సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 126 నాటౌట్ స్కోర్‌తో అతను టీ20ల్లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో కోహ్లీ పేరిట ఉన్న వ్యక్తిగత అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు గిల్ ఆ ఇన్నింగ్స్‌తో.. మూడు ఫార్మాట్లలో సెంచరీలు కొట్టిన అయిదవ బ్యాటర్‌గా రికార్డు నమోదు చేశాడు.
సూపర్ స్ట్రోక్ ప్లేతో చెలరేగిన గిల్‌పై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ తన ఇన్‌స్టా స్టోరీలో రియాక్ట్ అయ్యాడు. సితార అంటూ స్టార్ గుర్తును పోస్టు చేశాడు. గిల్‌తో కలిసి ఆడిన ఫోటోను పోస్టు చేసి.. భవిష్యత్తు ఇక్కడే ఉందని కూడా కామెంట్ చేశాడు. కివీస్‌తో సిరీస్‌కు కోహ్లీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో కోహ్లీ, గిల్లు ఆడనున్నారు.