Virat Kohli : ఆస్ట్రేలియా పర్యటనతో ఇంతవరకూ పరుగుల ఖాతా తెరవని భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. అభిమానుల సంద్రంలో తడిసిముద్దవుతున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో పెర్త్, అడిలైడ్‌లో అతడి ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు క్యూ కట్టారు. ఇప్పుడు మూడో వన్డేకు వేదికైన సిడ్నీలోనూ విరాట్‌తో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ కోసం ఫ్యాన్స్ పోటెత్తారు.
సిడ్నీ విమానాశ్రయంలో కోహ్లీ దిగాడని తెలియగానే అభిమానులు చుట్టుముట్టారు. ఆటోగ్రాఫ్ ప్లీజ్.. అని వెంటపడ్డారు. ఎస్కలేటర్ మీద నుంచి కిందికి దిగుతున్నా సరే వదల్లేదు. దాంతో.. ఎస్కలేటర్ మీద నుంచే అందరికీ ఓపికగా ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు విరాట్. అభిమాన క్రికెటర్ సంతకం దొరికిన వాళ్లు మస్త్ ఖుషీ అయ్యారు. మరికొందరేమో కోహ్లీతో సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు.
🚨 Today Virat Kohli was seen signing autographs for fans on running escalator.
In era where cricketers runs away from fans despite knowing that whatever money they earns due to fans, then there is Virat who is signing autographs & allowing fans to take selfies nonstop in Aus❤️ pic.twitter.com/zu6OIHiLSO
— Rajiv (@Rajiv1841) October 24, 2025
డకౌట్లతో వార్తల్లో నిలుస్తున్న విరాట్ కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. మూడో వన్డేలో దంచికొట్టి అభిమానులకు పరుగుల విందు ఇవ్వాలనుకుంటున్నాడు. సిరీస్ చేజారినా వైట్‌వాష్ తప్పాలంటే అతడు బ్యాటు ఝులిపించాల్సిందేనని టీమ్ కోరుకుంటోంది. విరాట్ కూడా తనమార్క్ ఇన్నింగ్స్‌తో కంగారూలను కంగారెత్తించాలనే కసితో ఉన్నాడు.అందుకు అవసరమైన మానసిక సన్నద్ధతతో శనివారం జరుగబోయే మూడో వన్డే కోసం జట్టుతో పాటు సిడ్నీకి చేరుకున్నాడీ స్టార్ ప్లేయర్.
Highs and lows, my support to Virat Kohli will always remain constant ❤️ pic.twitter.com/WEQyaeUMun
— Pari (@BluntIndianGal) October 23, 2025
రెండు ఓటములతో సిరీస్ కోల్పోయిన భారత జట్టు మూడో వన్డేలో విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఎంత ముఖ్యమో.. కోహ్లీకి అంతకంటే చాలా ముఖ్యం. ఎందుకంటే.. భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన అతడు.. రెండు డక్స్‌తో అందర్నీ విస్తుపోయేలా చేశాడు. అందుకే.. చివరిదైన మూడో వన్డేలో కోహ్లీ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. కానీ, ఆ మైదానంలో అతడి రికార్డేమీ ఘనంగా లేదు. ఇప్పటివరకూ అక్కడ ఏడు మ్యాచుల్లో మాజీ కెప్టెన్ ఒకేఒక
హాఫ్ సెంచరీ సాధించాడు. అది కూడా 2020లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా ఈ మైదానంలో 24.33 సగటుతో 146 రన్స్ చేశాడంతే. ప్రస్తుతం అతడి ఫామ్ చూస్తుంటే.. మూడో వన్డేలో అతడికి పిచ్ నుంచే కాకుండా కంగారూ పేసర్ల నుంచి కఠిన పరీక్ష ఎదురవ్వనుంది.