ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి హిట్టయ్యిందో తెలిసిందే. ఈ సినిమాలో ‘శ్రీవల్లి’ పాటలో బన్నీ వేసిన స్టెప్.. గడ్డం కింద చెయ్యిపెట్టి ‘తగ్గేదేలే’ అని చెప్పే డైలాగ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. చాలామంది స్టార్ క్రికెటర్లు కూడా వీటిని ఉపయోగించి తమ ఆటను సెలబ్రేట్ చేసుకున్నారు.
కొన్నిరోజుల క్రితం టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా వికెట్ తీసి ఇలానే ‘తగ్గేదేలే’ స్టైల్లో సెలబ్రేట్ చేసుకొని అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇప్పుడు ఈ జాబితాలో కింగ్ కోహ్లీ కూడా చేరాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 45 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లీ.. ఫీల్డింగ్ సమయంలో బౌలర్లను ఉత్సాహపరుస్తూ సరదాగా కనిపించాడు.
ఈ క్రమంలోనే జడేజా బౌలింగ్ చేస్తున్నప్పుడు ‘తగ్గేదేలే’ మ్యానరిజంతో జడ్డూను ఎంకరేజ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మొహాలీ వేదికగా జరిగిన ఈ టెస్టు కోహ్లీకి 100వ టెస్టు. కెప్టెన్గా రోహిత్ శర్మకు మొదటిది. ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టును వరుసగా రెండు సార్లు ఆలౌట్ చేసిన భారత బౌలర్లు.. టీమిండియాకు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని కట్టబెట్టారు.
— Addicric (@addicric) March 6, 2022