లండన్: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీకి ఉన్న క్రేజ్ మామూలు కాదు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినా కోహ్లీని ఆరాధించే అభిమానులకు కొదువలేదు. 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కల నెరవేరడంలో కీలకమైన కోహ్లీకి సోషల్‌మీడియాలో కనకవర్షం కురుస్తున్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ ఒక పోస్ట్‌కు ఎవరూ ఊహించిన విధంగా ఏకంగా రూ.12కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు.
ఈ విషయాన్ని ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ హబ్ తమ తాజా నివేదికలో పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 274మిలియన్ల ఫాలోవర్లను కల్గి ఉన్న కోహ్లీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న ప్లేయర్లలో గ్లోబల్ స్టార్స్ లెబ్రాన్ జేమ్స్, నెయ్‌మర్‌తో కలిసి 14వ స్థానంలో కొనసాగుతున్నాడు.
పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఒక పోస్ట్‌కు రికార్డు స్థాయిలో 27 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందుతున్నాడు. ఇదిలా ఉంటే పూమాతో ఎనిమిదేండ్ల ఒప్పందం ముగియడంతో కోహ్లీ తాజాగా అజిలిటాస్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాడు. ఈ కంపెనీలో కోహ్లీ 40 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు మనీకంట్రోల్ పేర్కొంది.