Virat Kohli : భీకర ఫామ్‌ను కొనసాగిస్తు విరాట్ కోహ్లీ (Virat Kohli ) వన్డేల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై రెండు శతకాలతో రెచ్చిపోయిన కోహ్లీ.. ఈసారి న్యూజిలాండ్‌పై చెలరేగుతున్నాడు. ఇండోర్ వన్డేలో అర్ధ శతకం బాదిన విరాట్.. 78వ సారి ఈ ఘనత సాధించాడు. కివీస్‌పై అతడు యాభై కొట్టడం ఇది పదిహేడోసారి. జట్టుపై అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన రెండో ఆటగాడిగా భారత స్టార్ రికార్డు సృష్టించాడు.
సిడ్నీ వన్డేలో అర్ధ శతకంతో ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ స్వదేశంలో జోరు చూపిస్తున్నాడు. మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో టీమిండియాను గెలిపించిన కోహ్లీ.. నిర్ణయాత్మక మూడో వన్డోలోనూ క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలోనే యాభై రన్స్ చేసిన అతడు బ్లాక్ క్యాప్స్‌పై 17వ సారి ఈ ఫీట్ సాధించాడు.
Half-century for Virat Kohli in the decider!
He gets to his 78th ODI FIFTY 👏👏
Updates ▶️ https://t.co/KR2ertVUf5#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/yK9UmFgESp
— BCCI (@BCCI) January 18, 2026
న్యూజిలాండ్‌పై అత్యధిక అర్ధ శతకాల రికార్డు వెటరన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) పేరిట ఉంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ 18సార్లు ఫిఫ్టీ బాది టాప్‌లో ఉన్నాడు. అయితే.. కోహ్లీ 36 ఇన్నింగ్స్‌ల్లో 17 హాఫ్ సెంచరీలు బాదేయగా.. పాంటింగ్ 50 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. డీన్ జోన్స్(ఆస్ట్రేలియా), కుమార సంగక్కర(శ్రీలంక)లు కివీస్‌పై 14 ఫిఫ్టీలతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు.