Virat Kohli | కోహ్లీకి రెండో ‘ఆరెంజ్ క్యాప్’.. తొలి విజేత ఎవరంటే..?
Virat Kohli : ఐపీఎల్ పదిహేడో సీజన్లో పరుగుల సునామీ సృష్టించిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆరెంజ్ క్యాప్ (Orange Cap) అందుకున్నాడు. తద్వారా రెండుసార్లు నారింజ టోపీని గెలిచిన భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డు నెలకొల్పాడు.
Virat Kohli : ఐపీఎల్ పదిహేడో సీజన్లో పరుగుల సునామీ సృష్టించిన విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆరెంజ్ క్యాప్ (Orange Cap) అందుకున్నాడు. తద్వారా రెండుసార్లు నారింజ టోపీని గెలిచిన భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ తొలిసారి 2016లో ఆరెంజ్ క్యాప్ సాధించాడు.
పదిహేడో సీజన్లో తొలి సెంచరీ బాదిన ఈ రన్ మెషీన్.. 5 హాఫ్ సెంచరీలతో 741 రన్స్ కొట్టాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం తడబడిన చోట కోహ్లీ తన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించాడు. అయితే.. ఈసారైనా ఆర్సీబీకి ట్రోఫీ అందించాలనుకున్న అతడి కల మాత్రం నెరవేరలేదు.

4 సెంచరీలు, 7 అర్ధ శతకాలు
ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న కోహ్లీ 2016లో కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. ఈ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ సెంచరీల మోత మోగించాడు. ప్రతి మ్యాచ్‌లో దంచికొట్టిన అతడు ఏకంగా 4 సెంచరీలు, 7 అర్ధ శతకాలు బాదేశాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 91.08 సగటుతో 973 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విజేతగా అవతరించాడు. కోహ్లీ వీరోచిత బ్యాటింగ్‌తో ఆ ఏడాది ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ, మరోసారి ఆఖరిమెట్టుపై తడబడింది. డేవిడ్ వార్నర్(David Warner) సారథ్యంలోని సన్‌రైజర్స్(Sunrises Hyderabad)కు ట్రోఫీని సమర్పించుకొన్న బెంగళూరు జట్టు రన్నరప్‌గా ఇంటికి వెళ్లింది.
ఆరెంజ్ విజేతలు ఆరుగురు
ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలిచిన భారత క్రికెటర్లు ఆరుగురు ఉన్నారు. వీళ్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) తొలిసారి ఆ ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్‌కు ఆడిన సచిన్ 2010లో 618 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 2014లో రాబిన్ ఊతప్ప(Robin Uthappa) 660 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్‌ను తన్నుకుపోయాడు.

ఆ తర్వాత 2016లో కోహ్లీ రికార్డు స్థాయిలో 973 రన్స్ కొట్టి విజేతగా నిలిచాడు. 2020లో కింగ్స్ లెవన్ పంజాబ్‌కు ఆడిన కేఎల్ రాహుల్(KL Rahul) 670 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. 2021 ఎడిషన్‌లో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులతో.. 2023లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 890 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ అందుకున్నారు.
ఇవి కూడా చదవండి
- Aparna Cinemas | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో కొత్త మల్టీప్లెక్స్
- Swati Maliwal | బిభవ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు..! కన్నీళ్లు పెట్టుకున్న స్వాతి మలివాల్
- Gangs of Godavari | ఐ లవ్ యూ నేహాశెట్టి అని చెప్పొచ్చు కదా.. విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

