Swati Maliwal | బిభవ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు..! కన్నీళ్లు పెట్టుకున్న స్వాతి మలివాల్
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సోమవారం విచారణ జరిపింది. కేసు విచారణ కోసం ఎంపీ స్వాతి మలివాల్ సైతం హాజరయ్యారు.
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సోమవారం విచారణ జరిపింది. కేసు విచారణ కోసం ఎంపీ స్వాతి మలివాల్ సైతం హాజరయ్యారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్నై నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది. బిభవ్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కౌరవులు, ద్రౌపది గురించి ప్రస్తావించారు. విచారణ సమయంలో ఎంపీ స్వాతి మలివాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కేసులో బిభవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సెక్షన్లపై అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో ఐపీసీ 308 కింద కేసు నమోదు చేసినా ప్రయోజనం లేదన్నారు.
స్వాతి మలివాల్‌ను సీఎం నివాసానికి పిలువలేదని.. ఆమె బలవంతంగా ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిందని.. బయటనే ఉండాలని సెక్యూరిటీ సిబ్బంది కోరారని.. సెక్యూరిటీ జోన్‌ను దాటి లోపలికి ప్రవేశించారని బిభవ్ తరపు న్యాయవాది తెలిపారు. తనను ఎవరూ ఆపలేరంటూ స్వాతి మలివాల్ దూషించారన్నారు. ఆ తర్వాత పీఏ బిభవ్ ఎవరి సూచనల మేరకు తనను లోపలికి అనుమతించారని అడిగారని.. సీఎం భద్రత బాధ్యత కూడా ఆయనదే కావడంతో అడగాల్సి వచ్చిందన్నారు. అనంతరం భద్రతా సిబ్బంది లోపలికి వెళ్లి ఆమెను గౌరవంగా బయటకు తీసుకువెళ్లారని.. ఈ పరిస్థితుల్లో అలాంటి సంఘటన ఎప్పుడు తలెత్తుతుంది? (స్వాతి మలివాల్ ఆరోపిస్తున్నట్లు) అని.. ఎంపీగా ఉంటే ఏదైనా చేసేందుకు మీకు లైసెన్స్ ఉన్నట్లేనా? అంటూ ఆయన ప్రశ్నించారు.
ఆమెను సీఎం నివాసానికి ఎవరూ పిలువలేదని.. పథకం ప్రకారం ఆమె ఆ రోజు అక్కడికి వచ్చిందని.. ఆ రోజు బిభవ్ గురించి స్వాతి మలివాల్ సెక్యూరిటీ సిబ్బందిని పదేపదే అడిగిందని.. స్వాతి మలివాల్ బయటకు వస్తున్నప్పుడు ఆమె సాధారణంగానే ఉందని బిభవ్ తరపు న్యాయవాది తెలిపారు. ఆమెకు ఏ సమస్య లేదని.. నిజంగానే తప్పు జరిగి ఉంటే అదే రోజు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. మూడు రోజుల తర్వాత ఈ విషయంలో ఆమె ఎందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని ప్రశ్నించారు. స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారని.. బిభవ్ తరపు న్యాయవాది తెలిపారు.
మహిళల హక్కుల గురించి ఆమెకు బాగా తెలుసునని.. హక్కులకు భంగం కలిగితే వెంటనే ఫిర్యాదు చేసి ఉండాల్సిందన్నారు. చాలా ఆలోచించిన తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకుందంటూ వాదనలు వినిపించారు. అయితే బిభవ్ తనపై విచక్షణా రహితంగా దాడి చేశాడని.. చెంపపై ఏడు ఎనిమిదిసార్లు కొట్టాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. కడుపులో తన్నడంతో పాటు సున్నిత భాగాలపైనా కొట్టాడని పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఈ నెల 18న బిభవ్ కుమార్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు నాలుగు రోజుల కస్టడీ విధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

