Virat Kohli | భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli)కి రికార్డులు కొత్త కాదు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిచండం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అందుకనే అనతి కాలంలోనే ప్రపంచంలోని మేటి ఆటగాళ్లలో ఒకడిగా పేరొందాడు. అభిమానులందరూ అతడిని ముద్దుగా కింగ్ అని పిలుస్తుంటారు. ఇక ఈ రికార్డుల రారాజు ఈరోజుతో అంతర్జాతీయ కెరీర్లో అడుగుపెట్టి సరిగ్గా 15 ఏండ్లు (15 Years of Virat) పూర్తయ్యాయి. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు వెనుతిరిగి చూసుకోలేదు. టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 500 మ్యాచ్‌లకు పైగా ఆడాడు.
నిలకడగా రాణిస్తూ ఛేజ్ మాస్టర్‌గా, సచిన్(Sachin Tendulkar) వారసుడిగా మాజీలచే కితాబు అందుకున్నాడు. ఈ క్రమలోనే మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) నుంచి 2014లో కోహ్లీ టెస్టు పగ్గాలు అందుకున్నాడు. అతన దూకుడు స్వభావంతో టీమిండియాను నంబర్ 1 జట్టుగా నిలిపాడు. అంతేకాదు ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చాడు. అయితే.. ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు అనూహ్యంగా ఓడిపోయింది. రెండోసారి డబ్ల్యూటీసీ చేరినా ఫలితం మారలేదు. ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో రోహిత్ శర్మ సేనపై గెలిచి టెస్టు గదను సొంతం చేసుకుంది.
Kohli
కోహ్లీ ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్లో 275 వన్డేలు, 111 టెస్టులు, 115 టీ20ల్లో ఆడాడు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో 49.3 సగటుతో 8676 పరుగులు చేశాడు. వన్డేల్లో 57.32 సగటుతో 12,898 పరుగులు బాదేశాడు. ఇక పొట్టి క్రికెట్లో 52.73 సగటు, 137.97 స్ట్రైక్ రేట్‌తో 4008 రన్స్ చేశాడు.
ఇక విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్లో అడుగుపెట్టి 15 ఏండ్లు పూర్తయిన సందర్భంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జై షా అభినందనలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 15 ఏళ్ల పూర్తి చేసుకోవడం పట్ల మీ అభిరుచి, పట్టుదల మరియు అద్భుతమైన విజయాలు కోట్ల మందికి స్ఫూర్తినిస్తున్నాయి. ఈ విజయాలను మీరు కొనసాగించాలని.. మరెన్నో మైలుస్టోన్స్తో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను! అంటూ జై షా ట్వీట్టర్లో రాసుకోచ్చాడు.
Congratulations to the incredible @imVkohli on 15 years of unwavering commitment to international cricket! Your passion, perseverance, and remarkable achievements have inspired millions. Wishing you continued success and many more milestones ahead! pic.twitter.com/oUsnAVLvqu
— Jay Shah (@JayShah) August 18, 2023
1⃣5⃣ years & counting 🫡
Celebrate @imVkohli‘s special milestone and relive his majestic century earlier this year in Trivandrum 🎥🔽 #TeamIndia
— BCCI (@BCCI) August 18, 2023
The arrival of King Kohli 🔥😍
Virat Kohli made his International debut #OnThisDay in 2008 and has been setting the stage on fire since the last 15 years! 🎯💯
He has dominated & conquered world cricket. 👏#India #ViratKohli #Cricket pic.twitter.com/GZi9szmBmP
— Sportskeeda (@Sportskeeda) August 18, 2023