Glenn Maxwell | మెల్బోర్న్: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని ఎగతాళి చేసినందుకు గాను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా రోజుల పాటు అతడు తనను బ్లాక్ చేశాడని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అన్నాడు. మ్యాక్సీ ఓ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ.. “నేను ఆర్సీబీకి వెళ్లినప్పుడు (2021లో) నాకు మొదటగా మెసేజ్ చేసింది కోహ్లీనే. ప్రీ ఐపీఎల్ ట్రైనింగ్ క్యాంప్ సందర్భంగా మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
అయితే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీని ఫాలో అవడం మొదలుపెట్టాను. కానీ కోహ్లీకి సంబంధించిన పోస్టులేవీ నాకు కనిపించకపోయేవి. అప్పుడే అతడు నన్ను బ్లాక్ చేశాడని తెలిసింది. ‘అవును. నువ్వు నన్ను ఎగతాళి చేసినందుకు అలా చేశానన్నాడు. కానీ ఆ తర్వాత అన్‌బ్లాక్ చేశాడు’ అని తెలిపాడు.