లక్నో: ఆర్సీబీ మంగళవారం ఓ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్(IPL 2025) ఆఖరి లీగ్‌లో లక్నోపై భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసింది. ఇక ఆ అపురూప క్షణాలను ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫుల్ ఎంజాయ్ చేశాడు. జితేశ్ విక్టరీ షాట్ కొట్టగానే.. డగౌట్లో ఉన్న కోహ్లీ కసి తీరా చిందేశాడు. ఆ తర్వాత ప్లేయర్లను కలుకున్న అతను ఆ సందర్భాన్ని కూడా తెగ ఎంజాయ్ చేశాడు.
థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిశాక.. గ్రౌండ్లో ఉన్న కోహ్లీ, ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న అనుష్కా .. ఒకరికి ఒకరు గాలిలో కిస్సులు ఇచ్చారు. అనుష్కా వైపు చూస్తూ చేయితో కిస్ ఇచ్చాడు కోహ్లీ. ఇక స్టాండ్స్‌లో ఉన్న అనుష్కా కూడా ఆ సంతోషాన్ని ఆపుకోలేక గాలిలో రిటర్న్ కిస్ ఇచ్చింది. ఆ వీడియో ఇప్పుడు యమ వైరల్ అవుతున్నది.
LIFE PEAKING AGAIN 😭😭🤍🤍 pic.twitter.com/anSYv6ddXY
— ` (@RCB_HIvv3) May 27, 2025