ప్రపంచ క్రికెట్లో విండీస్ స్టార్ ఆండ్రీ రస్సెల్‌కు ఎలాంటి రెప్యుటేషన్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ విధ్వంసక వీరుడు చాలా వింతగా అవుటైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐపీఎల్ తరహాలోనే బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) జరుగుతుందనే సంగతి తెలిసిందే. దీనిలో రస్సెల్ కూడా ఆడుతున్నాడు.
ఈ క్రమంలోనే వారి జట్టు ఇన్నింగ్స్ 15వ ఓవర్లో థర్డ్ మ్యాన్ దిశగా బంతిని కొట్టి సింగిల్‌కు పరుగు తీశాడు. ఆ సమయంలో రస్సెల్ భాగస్వామిగా మహ్మదుల్లా ఉన్నాడు. సింగిల్ కోసం రస్సెల్ పిలుపందుకున్న అతను.. డేంజర్ ఎండ్‌లోకి పరుగు తీశాడు. ఇక్కడే వింత జరిగింది.
థర్డ్‌మ్యాన్ దగ్గర ఫీల్డింగ్‌లో ఉన్న మెహదీ హసన్.. బంతి అందుకొని స్ట్రైకర్ దిశగా విసిరాడు. ఆ బంతి వికెట్లను తగిలింది. కానీ అప్పటికే మెహదీ క్రీజులో బ్యాటు పెట్టేశాడు. మెహదీ హసన్ క్రీజులోకి వెళ్లిందీ? లేనిదీ చూస్తు రస్సెల్ నిదానంగా నాన్‌స్ట్రైకర్ వైపు వెళ్తున్నాడు.
ఆ సమయంలో స్ట్రైకర్ ఎండ్ వికెట్లను తగిలిన బంతి.. అలాగే వచ్చి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లను తాకింది. అయితే అప్పటికి రస్సెల్ క్రీజులోకి రాలేదు. దీంతో అతను అవుటైనట్లు అంపైర్లు ప్రకటించారు. తనకు జరిగిన దాన్ని రస్సెల్ కూడా నమ్మలేకపోయినట్లు.. అతన్ని చూస్తేనే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అవుట్‌కు సంబంధించిన వీడియో నెట్టిట వైరల్ అవుతోంది.