ముంబై: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్నది. గత ఆరునెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతడు ఇటీవల మళ్లీ దవాఖానాలో చేరాడు. కాంబ్లీకి జ్ఞాపకశక్తి క్రమంగా క్షీణిస్తున్నదని, ఇదే పరిస్థితి కొనసాగితే అతడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశమూ లేకపోలేదని వైద్యులు తెలిపినట్టు అతడి ప్రాణ స్నేహితుడు మార్కస్ కౌటొ చెప్పాడు.
కాంబ్లీకి ఆర్థికంగా సాయం అందించేందుకు గాను తాను క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సైతం చేరాడని, మాస్టర్ బ్లాస్టర్ అతడిని ఆర్థికంగా ఆదుకుంటున్నాడని కౌటొ తెలిపాడు. కాంబ్లీకి గతంలో కూడా సచిన్ పలుమార్లు ఆర్థిక సాయం అందించాడు.