Vinesh Phogat | ఆసియా గేమ్స్ నుంచి వైదొలిగిన స్టార్ రెజ్లర్.. కారణం తెలుసా..?
Vinesh Phogat : ఆసియా గేమ్స్(Asia Games 2023)కు ముందు భారత్‌కు షాక్. డిఫెండింగ్ చాంపియన్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్(Vinesh Phogat) టోర్నీ నుంచి తప్పుకుంది. మోకాలి గాయం(Knee Injury) కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా...
Vinesh Phogat : ఆసియా గేమ్స్(Asia Games 2023)కు ముందు భారత్‌కు షాక్. డిఫెండింగ్ చాంపియన్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్(Vinesh Phogat) టోర్నీ నుంచి తప్పుకుంది. మోకాలి గాయం(Knee Injury) కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ‘అందరికీ హాయ్. మీ అందరికి ఒక బాధాకరమైన విషయం చెప్పాలనుకుంటున్నా. రెండు రోజుల క్రితం ట్రైనింగ్ సమయంలో ఎడమ మోకాలికి గాయం అయింది. స్కానింగ్ తీయించుకున్నా. స్కానింగ్ రిపోర్టు చూసిన డాక్టర్లు సర్జరీతోనే ఆ గాయం తగ్గుందని చెప్పారు. అందుకని ఆసియా గేమ్స్ నుంచి తప్పుకుంటున్నా’ అని వినేశ్ తెలిపింది. దాంతో, ఆమె స్థానంలో అంతిమ్ పంఘల్(Antim Panghal) 53కిలోల విభాగంలో బరిలోకి దిగనుంది.
‘నాలుగేళ్ల క్రితం(2018) జకార్తాలో గోల్డ్ మెడల్ గెలిచాను. ఈసారి కూడా పతకం సాధించాలని అనుకున్నా. కానీ, దురుదృష్టవశాత్తూ గాయంతో టోర్నీకి దూరమవుతున్నా. ఆగస్టు 17న ముంబైలో మోకాలికి సర్జరీ చేయించుకుంటున్నా. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశాను. దాంతో, వాళ్లు రిజర్వ్ ప్లేయర్‌ను ఆడిస్తారు’ అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 15, 2023
లైగింక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan) పై చర్యలు తీసుకోవాలనే ఆందోళనకు వినేశ్ ఫోగట్ నాయకత్వం వహించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రెజ్లర్లను ఒక్క తాటిపై నడిపి శభాష్ అనిపించుకుంది. ఆలోపే ఆసియా గేమ్స్ షెడ్యూల్ వచ్చింది. దాంతో, ట్రయల్స్ నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం సిద్ధమైంది. రెండు నెలలకు పైగా ఆందోళన చేపట్టడంతో తమకు మరింత సమయం ఇవ్వాలని వినేశ్, భజ్రంగ్ పూనియా కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur)ని కోరారు.
భజ్రంగ్ పూనియా, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్

దాంతో, ఆసియా గేమ్స్‌లో వినేశ్ ఫోగట్‌తో పాటు భజ్రంగ్ పూనియా(Bajrang Punia)లకు నేరుగా అనుమతి లభించింది. దాంతో, వీళ్లిద్దరిపై విమర్శలు వెల్లువెత్తాయి. ట్రయల్స్ లేకుండా ఎలా ఎంపిక చేస్తారు? అంటూ భారత ఒలింపిక్ సంఘానికి చెందిన అడ్ హక్ కమిటీని మిగతా రెజ్లర్లు నిలదేశారు. ఈ విషయంపై జూనియర్లు అంతిమ్ పంగల్, సుజీత్ కల్కాల్ కోర్టును ఆశ్రయించారు. అయితే.. ఢిల్లీ కోర్టు వినేశ్, భజ్‌రంగ్‌కు ఇచ్చిన మినహాయింపును సమర్థిస్తూ వాళ్ల పిటిషన్‌ను కొట్టేసింది. కానీ, ప్రధాన పోటీలకు రెజ్లర్ల ఎంపికలో పారదర్శకత లేకపోవడాన్ని అందరూ తప్పుబట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

