చెన్నై : చెన్నై గ్రాండ్మాస్టర్స్లో కీలకమైన ఆరో రౌండ్ గేమ్‌ను తొలి, రెండో స్థానాల్లో ఉన్న విన్సెంట్ కెమెర్ (జర్మనీ), భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి డ్రా చేసుకున్నారు. ఇరువురి మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన పోరు 41 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది.
తొమ్మిది రౌండ్లు ఉన్న ఈ టోర్నీలో అర్జున్, కెమెర్ పోరు డ్రా కావడంతో ఆరో రౌండ్ ముగిసేసరికి 4.5 జర్మనీ ఆటగాడు అగ్రస్థానంలో కొనసాగుతుండగా 3.5 పాయింట్లతో అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు. అవాండర్ లియాంగ్ (అమెరికా) కూడా 3.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.