జైపూర్ : విజయ్ హజారే ట్రోఫీలో బుధవారం హైదరాబాద్ జట్టు 6 వికెట్ల తేడాతో సర్వీసెస్ చేతిలో ఓటమి చవిచూసింది. తొలుత హైదరాబాద్ 210 పరుగులకు ఆలౌటయింది. రాహుల్ బుద్ధి(80), ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(45) రాణించారు.
అనంతరం సర్వీసెస్ 40.5 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రాజ్పుత్ పలివాల్(77నాటౌట్), వినీత్ ధన్కర్(78) రాణించారు.