INDU19 vs ZIMU19 : అండర్ -19 ప్రపంచకప్‌లో భారత జట్టు అజేయంగా దూసుకెళ్తోంది. హ్యాట్రిక్ విజయాలతో సూపర్ సిక్స్ చేరిన టీమిండియా ఆల్‌రౌండ్ షోతో జింబాబ్వేపై భారీ తేడాతో గెలుపొందింది. విహాన్ మల్హోత్రా(109), అభిగ్యాన్ కుందు(61)ల విధ్వంసంతో ప్రత్యర్థికి కొండంత లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్‌కు బౌలర్లు పరుగుల విజయాన్ని కట్టబెట్టారు. ఆయుష్ మాత్రే(3-14), ఉద్దవ్ మోహన్(3-25) తలా మూడేసీ వికెట్లతో జింబాబ్వే నడ్డి విరిచారు. దాంతో.. 204 రన్స్ తేడాతో గెలుపొందింది మాత్రే సేన.
పురుషుల అండర్ -19 ప్రపంచకప్‌లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. లీగ్ దశలో పంజా విసిరిన టీమిండియా సూపర్ సిక్స్‌లోనూ అదిరే విజయంతో ప్రత్యర్ధులకు హెచ్చరికలు పంపింది. బులవాయలోని స్పోర్ట్స్ క్లబ్లో జింబాబ్వేను చిత్తగా ఓడించింది భారత్. విహాన్ మల్హోత్రా(109), అభిగ్యాన్ కుందు(61), వైభవ్ సూర్యవంశీ()ల మెరుపులతో 353 రన్స్ కొట్టిన టీమిండియా.. ప్రత్యర్దిని 148కే ఆలౌట్ చేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే (3-14), ఉద్దవ్ మోహన్(3-25) వికెట్ల వేటతో జింబాబ్వేను పడగొట్టారు. వీరిద్దరి విజృంభణతో ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేయగా.. లిరోయ్ చివౌలా(62) హాఫ్ సెంచరీతో రాణించాడు.
For his superb century, Vihaan Malhotra is named the Player of the Match 🏅
India U19 register a commanding victory of 204 runs over Zimbabwe U19 👏
Scorecard ▶️ https://t.co/juFENSDomr#U19WorldCup pic.twitter.com/gH89E5dSgE
— BCCI (@BCCI) January 27, 2026
జింబాబ్వే బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(52) హడలెత్తించగా.. విహాన్ మల్హోత్రా(109) సూపర్ సెంచరీతో చెలరేగాడు. నాలుగేసి సిక్సర్లు, ఫోర్లతో 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్‌ను చిముగొరే బోల్తా కొట్టించాడు. వైభవ్ ఔటయ్యాక.. విహాన్, అభిగ్యాన్ కుందు(61)లు క్రీజులో పాతుకుపోయారు. వీరిద్దరూ ఆడుతూ పాడుతూ స్కోర్‌బోర్డును ఉరికించారు.
విహాన్ మల్హోత్రా(109)
ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు పునాది వేసిన అభిగ్యాన్ను మడ్జెన్గెరెరీ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత టెయిలెడర్లు అంబ్రిష్(21), హెనిల్ పటేల్(30)లతో కలిసి జట్టు స్కోర్ 300 దాటించిన విహాన్.. 49వ ఓవర్లో బౌండరీలో సెంచరీ సాధించాడు. దాంతో.. ప్రత్యర్ధికి 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది ఆయుష్ మాత్రే సేన.