క్రికెట్లో కొన్నిసార్లు జరిగే సంఘటనలు చూసే వాళ్లతోపాటు, ఆడే వాళ్లను కూడా నవ్వించేస్తాయి. ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్‌లో జరిగిన ఒక ఘటన కూడా అలాంటిదే. ఈ మ్యాచ్‌లో అత్యంత చెత్త బ్యాటింగ్ ప్రదర్శనతో శ్రీలంక చిత్తుగా ఓడింది. అయితే ఈ క్రమంలో జరిగిన ఒక ఘటన మాత్రం అందరి పెదాలపై నవ్వులు పూయించింది.
ట్రావిస్ హెడ్ వేసిన బంతిని క్రీజులో ఉన్న జాఫ్రీ వాండర్సే అంచనా వేయలేకపోయాడు. దీంతో అది లెగ్ వికెట్ బెయిల్‌ను పడగొట్టి గాల్లోకి లేచింది. లెగ్ స్లిప్స్‌లో ఉన్న వార్నర్ బంతిని క్యాచ్ పట్టేందుకు ముందుకు దూకాడు. అదే సమయంలో బంతి తగిలి గాల్లోకి లేచి బెయిల్.. నేరుగా వచ్చి వార్నర్‌కు చెప్పుకోలేని చోట తగిలింది.
దాంతో బంతిని వదిలేసిన వార్నర్ నేలపై పడిపోయాడు. మిగతా ఆటగాళ్లంతా వికెట్ పడిన ఆనందంలో ఉంటే వార్నర్ మాత్రం వికెట్ల వెనకాల నుంచి లేచి నిలబడలేక నవ్వేశాడు. ఇది చూసిన ఆటగాళ్లు, ప్రేక్షకుల పెదాలపై కూడా చిరునవ్వులు ప్రత్యక్షమయ్యాయి. దెబ్బ మరీ అంత గట్టిగా తగలకపోవడంతో వార్నర్‌కు ఏం కాలేదు.
Dave Warner copping a bail in the nuts#SLvAUS pic.twitter.com/oRkRRPZ305
— Zeus 🏏🏉 (@Zeus_Cricket) July 1, 2022