దుబాయ్: ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్( Viral Video )గా మారింది. దుబాయ్‌లోని ఫేమ్ పార్క్‌లో అక్కడి జంతువులతో అతడు ఎంజాయ్ చేస్తుండటం ఈ వీడియోలో చూడొచ్చు. నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియోలో.. యువీ ఓ లైగర్‌తో టగ్ ఆఫ్ వార్ కూడా చేశాడు. Tiger vs Liger అంటూ ఈ వీడియోను యువీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. యువీతోపాటు అతని మరో ఇద్దరు స్నేహితులు కూడా లైగర్‌తో టగ్ ఆఫ్ వార్‌లో తలపడ్డారు.
అయితే తుది ఫలితం ఏంటో మీకు తెలిసే ఉంటుంది అని ఈ వీడియోకు యువీ కామెంట్ చేశాడు. ఈ టగ్ ఆఫ్ వార్ ఒక్కటే కాదు.. ఆ తర్వాత భయంభయంగానే ఓ భారీ కొండచిలువను కూడా మెడలో వేసుకున్నాడు యువరాజ్. ఫేమ్ పార్క్ జంతువులకు చాలా సురక్షితమైన ప్రదేశమని, ఈ వీడియో తీసే సమయంలో ఏ జంతువుకూ హాని కలిగించలేదని కూడా యువరాజ్ చెప్పాడు.